04-10-2025 12:47:12 AM
ప్రజాపక్షం/ ఖమ్మం : భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంత ముగింపు సభను పురస్కరించుకుని ఈనెల ఐదున ఖమ్మంలో జరిగే ఆహ్వాన సంఘ సన్నాహాక సమావేశాన్ని జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్కె జానిమియా కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి సమావేశం శుక్రవారం ఏనుగు గాంధీ అధ్యక్షతన స్థానిక గిరిప్రసాద్ భవన్లో జరిగింది.
ఈ-సమావేశంలో జానిమియా మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ముగింపు వేడుక డిసెంబర్ 26నజరగనుందని ఈ వేడుకకు సంబంధించి ఐదున జరిగే ఆహ్వాన సంఘ సమావేశానికి సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా, -అతిథులుగా బినయ్ విశ్వం, కె నారాయణ, అజీజ్ పాషా, పువ్వాడ నాగేశ్వరరావు, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి లతో పాటూ -ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. ఖమ్మం నగరం నుంచి పెద్ద సంఖ్యలో సిపిఐ కార్యకర్తలు హాజరై ఆహ్వాన సంఘ సన్నాహాక సమావేశాన్ని జయప్రదం చేయాలని జానిమియా కోరారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహ్మద్ సలాం, పోటు కళావతి, పగడాల మల్లేష్, మేకల శ్రీనివాసరావు, యానాలి సాంబశివరెడ్డి, ఏరియా కార్యదర్శులు వరదా నర్సింహారావు, నూనె శశిధర్, జిల్లా సమితి సభ్యురాలు తాటి నిర్మల, ఎస్కె సైదా తదితరులు పాల్గొన్నారు.