04-10-2025 12:47:43 AM
రేణుక ఎల్లమ్మ ఆశీర్వాదం అందరిపై ఉండాలి
ధ్వజధారి కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, అక్టోబర్ 3(విజయక్రాంతి): మనిషిలో ఉన్న చెడు ఆలోచనల ను ఈ దసరా పండుగను పురస్కరించుకొని దహనం చేద్దాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన రావణ దహనం కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎంపి డికె అరు ణ తో కలిసి హాజరై మాట్లాడారు. ఈ సంవత్సరం దుర్గా మాత అనుగ్రహం మనమీద ఉంది కాబట్టి మన మహబూబ్ నగర్ కు ఇంజనీరింగ్ లా కళాశాల తో పాటు ఐఐఐ టి కళాశాల సైతం వచ్చాయని , అమ్మ వారి అనుగ్రహం ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. ఈర్షాద్వేషాలను వదిలి సుఖసంతోషాలతో మహబూబ్ న గర్ ప్రజలు కలిసిమెలిసి సోదర భావంతో జీవించాలని ఆయన అన్నారు.
అనంతరం దసరా సంబరాలలో భాగంగా వివిధ రూ పాల్లో ఏర్పాటు చేసిన తారా జువ్వలు ఆహుతులను , ప్రజలను అలరించాయి. అనంత రం జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ధ్వజధారి శ్రీ కల కొండ సూర్యనారాయణకు స్వాగతం పలికారు. కార్యక్రమాలలో మూడా చైర్మన్ లక్ష్మ ణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ఉపాధ్యక్షులు చంద్రకుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఆర్య సమాజ్ అధ్యక్షులు డాక్టర్ భరద్వాజ్ నారాయణరావు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు గోపాల్ యాదవ్, ఖాజా పాషా, రాషెద్ ఖాన్, ప్ర శాంత్ , అంజద్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.