23-09-2025 07:24:44 PM
ఐసిడిఎస్ సూపర్వైజర్ వసుమతి, సంతోష
డాక్టర్ సాయి సౌమ్య..
శివంపేట్ (విజయక్రాంతి): శివపేట మండలంలోని శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోషణ మాస ఉత్సవాలు జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యంగా ఉండాలని అక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళలకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేయించడం జరిగింది. పోషణ లోపం ఉన్న పిల్లలని కూడా పరీక్షలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా దొరికే 40 రకాల ఆకుకూరలను సేకరించి అక్కడ ప్రదర్శించి వాటిలో ఉన్న పోషక విలువల గురించి తెలియపరిచి ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో సేంద్రియ పంటలతో పండించే వంటకాలను మాత్రమే తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివంపేట సూపర్వైజర్స్ సంతోష వసుమతి, స్థానిక డాక్టర్ సాయి సౌమ్య, అంగన్వాడీ టీచర్లు వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.