calender_icon.png 15 September, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18న విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయండి

15-09-2025 05:00:27 PM

జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఆంధ్రలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ జైభీమ్ రావ్ భారత్ పార్టీ(Jaibhim Rao Bharat Party) వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరగనున్న మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేబీపీ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ కోరారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే కూటమి ప్రభుత్వ కపట నాటకాలను బహుజన సమాజం ఎండగట్టాలన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వైద్య విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం సమంజసం కాదన్నారు. ఆంధ్రాలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగ పరంగా సంక్రమించిన రిజర్వేషన్లు భవిష్యత్తులో ఎత్తివేసే కుట్రలో భాగంగా 12ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుందని దీన్ని తిప్పి కొట్టాలని అందులో భాగంగా జేబీపీ జాతీయ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ చేయనున్న మహాధర్నా కార్యక్రమమనికి వందలాది మంది హాజరు కావాలని,కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం ఉదయం 6గంటలకు కొత్తగూడెంలోని జిల్లా పార్టీ కార్యాలయం నుండి భారీ వాహన శ్రేణితో ర్యాలీగా విజయవాడ ధర్నా చౌక్ వద్దకు బయలుదేరడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ్, బాబీ, మురళి, కిషన్ తదితరులు పాల్గొన్నారు.