calender_icon.png 15 September, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెల్పింగ్ హాండ్స్ దాతృత్వం..

15-09-2025 04:57:36 PM

30 వేల ఆర్థిక సాయం అందజేత..

దేవరకొండ (విజయక్రాంతి): పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట గ్రామానికి చెందిన దండుగుల కళ్యాణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ 3వ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నది. ఇటీవలే సాగర్ హైవే పై తన తండ్రితో వెళ్తుండగా ఆక్సిడెంట్ అయింది. అక్కడికక్కడే నాన్న చనిపోవడం జరిగింది. కళ్యాణికి రెండు కాళ్ళకి బలమైన గాయాలు తాకడంతో తను కూడా ఆసుపత్రి పాలు అవడం ఆర్థికంగా ఇబ్బంది పడడం జరిగింది. ఎంబిబిఎస్ చదువుతుందడంతో చదువును మధ్యలో ఆపకూడదని హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చి 30,000/- రూపాయల ఆర్థిక సహాయన్నీ అందించారు. ఈ కార్యక్రమంలో అన్వేష్, నరేష్, సాయి, కృష్ణ, వెంకటేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.