25-08-2025 12:31:11 AM
మంగపేట, ఆగస్టు 24 (విజయ క్రాంతి ): మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహ స్వామి వారి దేవాలయం ఆదివారం భక్తులతో జనసంద్రంగా మారింది. ప్రత్యేకంగా సెలవు దినాలలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో రద్దీ మరింత పెరిగింది.ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న శిల్పాలతో ఫోటోలు దిగుతూ భక్తులు ఆనందపడ్డారు.అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చింతామణి జలపాతంలో స్నానం ఆచరించి నీటిని స్వీకరిస్తే రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఆలయ అర్చకులు భక్తులకు స్వామివారి విశేషాలు వివరించి గోత్రనామాలతో అర్చనలు పూజలు నిర్వహించారు.