calender_icon.png 13 November, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిన్నెర అఖాడా నుంచి మమతా కులకర్ణి బహిష్కరణ

01-02-2025 12:46:48 AM

ప్రయాగ్‌రాజ్, జనవరి 31: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో సన్యాసినిగా మారి మహామండలేశ్వర్ దీక్ష తీసుకున్న బాలీవుడ్ నటి మమతా కులకర్ణిని ‘కిన్నెర అఖాడా’ ఆధ్యాత్మిక సంస్థ బహిష్కరించింది. ఆమెకు సంస్థలో అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్ హోదా కట్టబెట్టడడంపై  పలువురు మతపెద్దలు, అఖాడాలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మాట్లాడుతూ.. మమతా కులకర్ణి అసభ్యతను ప్రోత్సహిస్తున్నారని, ఆమెకు మహామండలేశ్వర్ హోదా కల్పించడం తగదని అభిప్రాయపడ్డారు. దీంతో సంస్థ పెద్దలు దిగి వచ్చి మమతా కులకర్ణిని సంస్థ నుంచి బహిష్కరించారు. సంస్థ అలాగే ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని కూడా అనేక కారణాల నేపథ్యంలో బహిష్కరించింది.