19-11-2025 12:35:00 AM
సిద్దిపేట క్రైం, నవంబర్ 18 : అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు సిద్దిపేట టూటౌన్ ఇన్స్పెక్టర్ బి.ఉపేం దర్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని రాంనగర్ కు చెందిన కిర్ని అనిల్ కుమార్ అనే వ్యక్తి ప్రజల అవసరాలను ఆసరా చేసుకొని, వారి వాహనాలను తాకట్టు పెట్టుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నట్టు ఫిర్యాదు అందిందని చెప్పారు. మంగళవారం నిందితుడి పై కేసు నమోదు చేసి, 9 ద్విచక్ర వాహనా లు, 4 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్టు చె ప్పారు. ఎవరైనా అక్రమ వడ్డీ వ్యాపారాలకు పాల్పడితే, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.