calender_icon.png 9 January, 2026 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

06-01-2026 12:14:56 AM

టేకులపల్లి, జనవరి 5, (విజయక్రాంతి): ద్విచక్ర వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం టేకులపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని రోళ్లపాడు గ్రామం నుంచి తమ సొంత గ్రామమైన 9వ మైలు తండా గ్రామానికి ద్విచక్ర వాహనంపై  వస్తుండగా ఆరోమైలు సమీపంలో అదుపు తప్పి కల్వర్టును ఢీకొని గుగులోతు అశోక్ (30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య ఆరు నెలల గర్భిణీ. పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇల్లందు వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర రాజేందర్ తెలిపారు.