06-09-2025 12:04:15 AM
పటాన్ చెరు, సెప్టెంబర్ 5 :వినాయక చవితి బ్రహ్మోత్సవాలలో భాగంగా రుద్రారంలో ప్రసిద్ధిగాంచిన గణేష్ గడ్డ సిద్ధి వినాయకుడు 10 వ రోజు పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్య లో తరలి వస్తున్నారు. అనంతరం స్వామివారి అన్నదానం, భజన కీర్తనలు కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.