03-05-2025 09:30:57 PM
పటాన్ చెరు,(విజయక్రాంతి): అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 455 ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు. ఒక అక్రమ ఇంటి నిర్మాణంతో పాటు మరో బేస్మెంట్, ప్రహరీ గోడను జేసీబీతో తొలగించి సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తహసీల్దార్ వెంకటస్వామి తెలిపారు. ప్రభుత్వ భూమిలో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. ఉప తహసిల్దార్ హరిశ్చంద్ర ప్రసాద్, ఆర్ఐ రఘునాథ్ రెడ్డి, శ్రీమాన్ రాజు సిబ్బంది పాల్గొన్నారు.