calender_icon.png 20 October, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్యగేయాలతో ఆలోచింప చేసిన ‘మేఘవిచ్చెదనం’

20-10-2025 12:05:03 AM

గజల్ కవి సూరారం శంకర్ 

కామారెడ్డి, అక్టోబర్ 19 (విజయక్రాంతి)కామారెడ్డి లో మేఘ విచ్చేదినం పుస్తకావిష్కరణ పుస్తకాన్ని గజల్ కవి సూరారం శంకర్ అన్నారు. తెరవే జిల్లా ఉపాధ్యక్షులు కవి రచయిత ఎన్ని శెట్టి గంగా ప్రసాద్ రచించిన మేఘవిచ్చేదనం పుస్తకంలో కామారెడ్డి లోని జలవిలయ వేదనను వర్ణించారని  ఎన్నో సూచనలు ఉన్నాయ నిపుస్తక ఆవిష్కర్త సూరారం శంకర్ అన్నారు.

కామారెడ్డిలో ఆదివారం తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం భవనంలో ఎనిశెట్టి గంగా ప్రసాద్ రాసిన మేఘ విచ్చేదనం పుస్తక ఆవిష్కరణ సూరారం శంకర్ చేశారు.ఈ సందర్భంగా ఆవిష్కర్త మాట్లాడుతూ మేఘవిచ్చేదనం పుస్తకంలో ఆలోచనత్మకమైన అంశాలు ఉన్నాయని అన్నారు.

సభకు అధ్యక్షత వహించిన తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ మాట్లాడుతూ సాహిత్యం సమాజాన్ని ఆలోచింపజేయాలని మార్గదర్శకంగా నిలవాలని సమాజానికి ఆపద వచ్చినప్పుడు తోడుగా నిలవాలని అన్నారు.పుస్తక కర్త ఎనిశెట్టి గంగా ప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరెన్నో మంచి రచనలు చేస్తానని అన్నారు.

ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పుస్తక కర్త ఇనిశెట్టి గంగా ప్రసాద్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోహన్ రాజ్, మంద పీతాంబర్,శ్యామ్ కుమార్ ,మౌర్య కాశ నరసయ్య, తిరుపతిరావు, సంఘ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటి,  కందుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.