calender_icon.png 26 November, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీ చాటుకున్న కానిస్టేబుల్

25-11-2025 10:00:41 PM

పోగొట్టుకున్న ఫోన్, నగదు అప్పగింత..

సిద్దిపేట క్రైం: చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పరశురాములు అనే కానిస్టేబుల్ విధి నిర్వహణలో భాగంగా రామునిపట్ల గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక మొబైల్ ఫోన్ దొరికింది. ఫోన్ పౌచ్లో రూ.16 వందల నగదు ఉన్నాయి. ఫోన్ వెనుక ఉన్న నెంబర్ ఆధారంగా దాని యజమాని నాయిని లత అని గుర్తించారు. ఆమెను చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ కు పిలిచి ఫోన్, నగదు అప్పగించారు.