12-01-2026 01:52:54 AM
రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్‌లో రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలు, అన్ని మతాల గర్భిణులకు రూపాయి ఫౌండేషన్ ద్వారా శ్రీ మంతం జరిపించి, చీర సారే పసుపు కుంకు మ గాజులు అందించినట్టు ఫౌండేషన్ చైర్మ న్ నాగమళ్ళ అనిల్ కుమార్, ప్రాజెక్టు కన్వినర్ జగిని శ్రీనివాస్, కో కన్వినర్ యాడవెళ్లి బాలరాజు తెలిపారు.
ప్రాజెక్టు చైర్మన్ నర్సిం హా రావు, కో చైర్మన్ రమణయ్య మాట్లాడుతూ.. దాదాపు 511 మంది పేద మహిళ లకు శ్రీమంతం చేయడం ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తామని అన్నారు. సైదాబాద్ మండల్ సీడీపివో పార్వతి మాట్లాడుతూ.. మా మండలంలో 42 అంగన్వాడి సెంటర్ల నుండి 515 మంది గర్భిణులను టీచర్లు ఇక్కడికి తీసుకొని రావడం సంతోషకరం అని అన్నారు. అందులో ఎక్కువగా ముస్లిం మై నారిటీ మహిళలు ఉండడం గొప్ప విశేషం అని తెలిపారు.