12-01-2026 01:51:23 AM
ఆ విధంగా నిర్మాణం చేయాలి
రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
సూర్యాపేట, జనవరి 11 (విజయక్రాంతి): రెండు రాష్ట్రాలకు వారధిగా సూర్యాపేటలో పెరిక భవన్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ది వ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య కోరారు. ఆదివారం రాత్రి కోదాడ పెరిక హాస్టల్ భవనంలో ఏర్పాటు చేసిన సూర్యాపేట జిల్లా కుల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రం లో జుట్టుకొండ సత్యనారాయణ, అంగిరేకుల నాగార్జున సహకారంతో గత ప్రభుత్వం లో జిల్లా కేంద్రంలో పెరిక భవన్ ఏర్పాటుకు సాధించుకున్న ఎకరం స్థలంలో కుల స్తులకు ఉపయోగకరంగా నిర్మించుకుందామన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉంటూ పార్టీ అధినాయకులతో మాట్లాడి పెరిక కులానికి కార్పొరేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చిన తర్వాతనే తాను ప్రచారానికి వెళ్లినట్లు తెలిపారు. అధికారం చేపట్టిన తర్వా త తమ కులానికి అనుకున్న ప్రకారం పెరిక కార్పొరేషన్ ఇవ్వాలని కోరగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. జిల్లా కేంద్రంలో ఆత్మగౌరవ భవనాన్ని ఈ ప్రభుత్వంలోనే పూర్తి చేద్దామన్నారు. కోదాడ పెరిక హాస్టల్ కు దీటుగా భవన నిర్మాణం జరగాలన్నారు.
పెరిక కార్పొరేషన్ నుంచి, మంత్రులు ప్రభుత్వంతో మాట్లాడి నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లతో తనకు సన్నిహిత్యం ఉందని వారి సహకారంతో కులాభివృద్ధికి పాటుపడతానన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా సంఘం సభ్యులను ప్రకటించారు. జిల్లా పెరిక సం ఘం అధ్యక్షుడిగా సముద్రాల రాంబా బు, ప్రధాన కార్యదర్శిగా ప్రతిపాక జనార్దన్, యూత్ కమిటీ అధ్యక్షుడిగా బుడిగం కిరణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా వనపర్తి లక్ష్మీనా రాయణ, సూర్యాపేట పెరిక భవన్ నిర్మాణ కమిటీ గౌరవ సలహాదారులుగా ముత్తినేని వీరయ్య, జుట్టుకొండ సత్యనారాయణ, అం గిరేకుల నాగార్జున, దొంగరి వెంకటేశ్వర్లు, సుంకరి అజయ్ కుమార్, రామినేని శ్రీనివాసులను నియమించారు.