18-01-2026 02:16:46 AM
కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, జనవరి 17(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా పక్షాన పోరాడుతు న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) లోకి చేరికల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మల్లన్న సిద్ధాంతాలకు ఆకర్షితులై యువత, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. ఇందులో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్, అబ్దుల్లాపూర్మెట్ మండలాలకు చెందిన పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్ నేతృత్వంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
షాద్ నగర్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని హరిశంకర్ గౌడ్ సమన్వయం చేస్తూ, పార్టీ ఆశయాలను వారికి వివరించారు.పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, రంగారెడ్డి జిల్లాకు చెందిన వివిధ విభాగాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.