18-01-2026 01:16:03 AM
ముషీరాబాద్, జనవరి17 (విజయక్రాంతి): బీసీలకే రాజ్యాధికారం అనే నినా దాన్ని బలోపేతం చేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ రాజకీయ కూటమి ప్రధాన కార్యదర్శి కపిలవాయి దిలీప్ కుమార్, అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ ప్రకటించారు. శనివారం కవాడిగూడలోని టీఆర్ ఎల్‌డీ రాష్ర్ట కార్యాలయంలో తెలంగాణ రాజకీయ కూటమి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ర్ట ఎన్నికల సంఘం (సెక్) వద్ద నమోదైన పది రాజకీయ పార్టీలు కలిసి తెలంగాణ రాజకీయ కూటమిగా ఏర్పడినట్లు సమావేశంలో ప్రకటిం చారు. కూటమి అధ్యక్షుడిగా ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా కపిలవాయి దిలీప్‌కుమార్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా కూటమి ప్రధాన కార్యదర్శి కపిలవా యి దిలీప్ కుమార్ మాట్లాడు తూ.. రాబో యే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమిలోని అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోటీ చేస్తాయని, విడివిడిగా అభ్యర్థులను నిలబెట్టకుండా కూటమి నుంచే పోటీకి దింపు తామని పేర్కొన్నారు. ప్రజల్లో బలంగా వినిపిస్తున్న బీసీలకే రాజ్యాధికారం నినాదాన్ని బలోపేతం చేయడమే కూటమి ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. సామాజిక న్యా యం, రాజకీయ అధికారం సాధించడమే తమ ఎజెండా అని పేర్కొన్నారు
. కూటమి అధ్యక్షుడు, రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ మా ట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు నిజమైన రాజకీయ అధికారం సాధించాలంటే మరిన్ని రాజకీయ పార్టీలు ఈ కూటమిలో చేరాల్సిన అవసరం ఉందన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన కాలేశ్వరం అవినీతిపై సీఎం రేవంత్‌రెడ్డి కమిషన్ వేసిందని, అదే ధరణిలో జరిగిన రూ.5 లక్షల కోట్ల అవినీతిపై ఎందుకు కమిషన్ వేయలేదని ప్రశ్నించారు. అవినీతిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ధరణిలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రత్యేక కమిషన్ వేసి సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
గ్లోబల్ సమ్మిట్ పేరిట ఐదు లక్షల కోట్ల విలువచేసే అసైన్డ్ భూములను సీఎం రేవంత్‌రెడ్డి అమ్ముకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయ న ఆరోపించారు. పెట్టుబడిదారులకు భూ ములను ధారాదత్తం చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో మహా జన సేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల ప్రదీప్‌గౌడ్, డాక్టర్ ఈడ శేషగిరిరావు- (ఈసీ మెం బెర్, ఆధార్ పార్టీ), లాలు నాయక్ రామావత్ (వర్కింగ్ ప్రెసిడెంట్, బహుజన రాజ్యం పార్టీ), మహమ్మద్ షకీల్ (వర్కింగ్ ప్రెసిడెంట్, ముస్లిం లీగ్ పార్టీ), కొలిశెట్టి శివకుమార్ (జనరల్ సెక్రటరీ, యుగ తులసీ పార్టీ), డేవిడ్ ఆండ్రూ (జనరల్ సెక్రటరీ, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ); ఎ సుదర్శన్ (జనరల్ సెక్రటరీ, శివసేన, యూబీటీ), గౌర బీరప్ప, నాయకులు పాల్గొన్నారు.