calender_icon.png 18 January, 2026 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ బెలూన్ సేఫ్‌గా ల్యాండయింది!

18-01-2026 02:12:55 AM

  1. నెక్నాపూర్ చెరువు సమీపంలో బెలూన్ కిందకు దిగింది
  2. డీజీసీఏ నిబంధనల ప్రకారమే దింపాము
  3. వెల్లడించిన నిర్వాహకులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (విజయక్రాంతి): గోల్కొండ కోట వేదికగా జరుగుతున్న తెలంగాణ ఇంటర్నేషనల్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌లో శనివారం ఉదయం స్వల్ప గందరగోళం నెలకొంది. శనివారం ఉదయం 18 బెలూన్లు గాలిలోకి ఎగిరాయి. ఇందులో 14వ నంబర్ కలిగిన బెలూన్ నార్సింగి సర్కిల్, మణికొండ పరిధిలోని నెక్నాపూర్ చెరువు సమీపంలో కిందకు దిగింది. భారీ బెలూన్ జనావాసాల మధ్య, చెరువు దగ్గరగా దిగడంతో అందులో సాంకేతిక సమస్య తలెత్తిందని, అందుకే పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారని స్థానికులు భావించారు. బెలూన్ చెరువులో పడిపోయిందంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ ఘటనపై ఉత్సవ నిర్వాహకులు వెంటనే స్పందించారు.

నేక్నాపూర్ చెరువు వద్ద బెలూన్ సురక్షితంగానే ల్యాండ్ అయ్యిందని చెప్పారు. అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, బెలూన్ చెరువు లో పడలేదని, ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తలేదు అని స్పష్టం చేశారు. అనుభవం ఉన్న పైలట్లు, రిజిస్టర్డ్ బెలూన్లతోనే ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వాస్త వాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయవ ద్దని వారు విజ్ఞప్తి చేశారు. ల్యాండింగ్ తర్వాత బెలూన్ను ఫోల్డింగ్ చేసి వాహనాల్లో తరలించామని తెలిపారు.