calender_icon.png 18 January, 2026 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్కీ డ్రాల పేరుతో లూటీ చేస్తారు

18-01-2026 02:15:10 AM

  1. రీల్స్ మాయగాళ్లను నమ్మొద్దు
  2. హైదరాబాద్ సీపీ సజ్జనార్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (విజయక్రాంతి): రీల్స్ మాయగాళ్లను నమ్మొ ద్దని, లక్కీ డ్రాల పేరుతో లూటీ చేస్తారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్కీ డ్రాల పేరుతో జనాల జేబులకు చిల్లులు పెడుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు కూడా ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాపులారిటీ ఉం ది కదా అని మోసాలకు పాల్పడితే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు. రూ.99, రూ.199 కడితే చాలు.. ఖరీదైన కార్లు, స్పోర్ట్స్ బైకులు, ప్లాట్లు, ఐఫోన్లు, డీజే సెట్లు బహుమతులుగా ఇస్తామంటూ రీల్స్ లో ఊదరగొడుతున్నారని, ఇదంతా బూటకమని, ప్రజలు నమ్మవద్దని సూచించారు.