18-01-2026 01:18:35 AM
సికింద్రాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): రానున్న మున్సిపల్, కా ర్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయ మే ఏకైక లక్ష్యంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అధ్యక్షతన సికింద్రాబాద్‌లో నిర్వహించిన విజయ్ సంకల్ప సమ్మేళనంలో కేంద్ర మం త్రి మాట్లాడారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రజలను లేనిపోని వాగ్దానాలతో మోసం చేశాయని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియ జెప్పాలని సూచిం చారు. సికింద్రాబాద్ కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డి మాండ్ చేశారు.
జంట నగరాల్లో సికింద్రాబాద్ ఎన్నో సంవత్సరాలుగా అన్నింటికీ కేంద్రంగా ఉందని, అలాంటి సికింద్రాబాద్ పేరు లేకుండా మల్కాజిగిరి మున్సి పల్ కార్పొరేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తుండటం సరికాదన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. లేదం టే బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరిం చారు. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీల్లో పోటీకి బీజేపీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
తెలంగాణ రాజకీయాల్లో పోటీ కేవలం కాంగ్రెస్,- బీజేపీ మధ్యే ఉన్నదని, ప్రజలు కూడా ఈ రెండు పార్టీలనే ప్రత్యామ్నాయాలుగా చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రజల్లో పూర్తిగా కనుమరుగైందని విమర్శించారు. దోచుకున్న ప్రజాసొమ్మును పంచుకోవడంలోనే వారు నిమగ్నమై ఉన్నారని ఆరోపిం చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా మారిందని విమర్శిం చారు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంద న్నారు. గత 11 ఏళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ. 12 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని చెప్పారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా, కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నాయకులకు సూచించారు. మరికొన్ని రోజుల్లో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నట్టు రాంచందర్‌రావు వెల్లడించారు. కాగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి మున్సిపా లిటీకి రాష్ట్ర పార్టీ తరఫున ఒక ఇన్‌చార్జిని నియమించారు. కార్పొరేషన్లకు కూడా ప్రత్యే క ఇన్‌చార్జిలను నియమించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి సం ఘటన మం త్రి చంద్రశేఖర్ తివారీ, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా.ఎన్.గౌతం రావు, వేముల అశోక్, పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్, మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్, మేకల సారంగపాణి, డాక్టర్ వంశీ తిలక్, షేక్ షాజహాన్, రాయల్ కుమార్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.