05-11-2025 12:53:22 AM
రెండున్నర కిలోల వెండి అభరణాలు,
రూ. 2.50 లక్షల నగదు చోరీ చేసిన దుండగులు
కామారెడ్డి, నవంబర్ 4, (విజయక్రాంతి): బంధువుల ఇంటికి వెళ్లిన పాపానికి తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి ఇల్లును గుల్ల చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ భారీ చోరీ పోలీసులను కలవరానికి గురిచేస్తుంది. దేవునిపల్లి శివారులోని మెడికల్ కళాశాల సమీపంలో నివాసముంటున్న చంద్రమోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్ళాడు.
మంగళవారం ఉదయం వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోని బీరువాలో ఉన్న ఆరున్నర తులాల బంగారు నగలు, రెండున్నర కిలోల వెండి నగలు, రూ. 2.50 లక్షల నగదు చోరీకి గురయ్యాయి. బాధితుడు దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవునిపల్లి ఎస్త్స్ర భువనేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. క్లోస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరించారు.
దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు లను పరిశీలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల కు చెందిన దొంగల ముఠా పని అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరగడం పోలీసులకు సవాలు విసిరినట్లు అయింది.