calender_icon.png 10 September, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ విముక్తి కోసం పోరాడిన ధీరశాలి

10-09-2025 07:28:22 PM

మాజీ మేయర్ సునీల్ రావు

కొత్తపల్లి (విజయక్రాంతి): భూ పెత్తందారులు, నైజాముల అరచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ధీర వనిత చిట్యాల ఐలమ్మ అని బీజేపీ నాయకులు, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Former Mayor Yadagiri Sunil Rao) అన్నారు. కరీంనగర్ నగరంలోని ప్రతిమ జంక్షన్ వద్ద గల ఐలమ్మ విగ్రహానికి మాజీ మేయర్ సునీల్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ తొలి భూ పోరాటానికి, సామాజిక అధునిక పరిణామానికి నాంది పలికిన ధైర్యశాలి అన్నారు. ఐలమ్మ వీరత్వాన్ని ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీస్కోవాలని అన్నారు. భావి తరానికి ఐలమ్మ చూపిన తెగువ స్పూర్తి దాయకం అని, చాకలి ఐలమ్మ లాంటి యోధురాలిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.