calender_icon.png 11 September, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత

10-09-2025 07:24:45 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): తొలి భూ పోరాటానికి నాంది పలికిన ధెైర్యశాలి, వీర వనిత చాకలి ఐలమ్మ అని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి(BJP District President Gangadi Krishna Reddy) కొనియాడారు. శంకరపట్నం బిజెపి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి ముందుగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ వీరత్వం మరువలేని, భూమి, భుక్తి, వెట్టి చాకిరి  విముక్తి కోసం పోరాడి, తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పి, ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన గొప్ప పోరాట యోధురాలు ఐలమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధనకార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అలివెళ్లి సమ్మీరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య జిల్లా కౌన్సిల్ సభ్యులు దశరాపు నరేందర్, మండల ఉపాధ్యక్షులు ఎల్కపాల్లి సంపత్ ఎస్ టి మూర్ఛ మండల అధ్యక్షులు బిజీలి సారయ్య, శక్తీ కేంద్ర ఇంఛార్జి రాచమల్ల శ్రీనివాస్, చుక్కల శ్రీకాంత్ పాల్గొన్నారు.