21-06-2024 12:05:00 AM
వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహీ, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి రూపొందిస్తున్నాయి. డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మాతలు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్ ప్రారంభమైంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలోని మ్యాసీవ్ సెట్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
ఈ 40 రోజుల లెన్తీ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా సెట్‌ను నిర్మించామని చిత్రబృందం తెలిపింది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, వరుణ్, నోరా, మీనాక్షి ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్న అవతారాలలో కనిపిస్తారని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో ఇంకా నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి.రవిశంకర్ తదితరులు ముఖ్య తారాగణం కాగా, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్; సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; డీపీవో: ఎ.కిషోర్ కుమార్.