16-10-2025 07:29:11 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామ ప్రజల వల్ల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీ గురువారం లెక్కించారు. 3 నెలల 22 రోజులకు గాను హుండీ ద్వారా 11,89,195 రూపాయలు, నిత్యాన్నప్రసాదం ద్వారా 4,236 రూపాయలు ఆదాయము వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహణాధికారి సెల్వాద్రి మోహన్ బాబు తెలిపారు. ఈ లెక్కింపులో సహాయ కమీషనర్, దేవాదాయ ధర్మదాయ శాఖ బాస్కర్, ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.