11-11-2025 09:53:33 PM
సూర్యాపేట (విజయక్రాంతి): అందెశ్రీ మృతి సాహితి లోకానికి తీరని లోటు అని బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ భద్రబోయిన సైదులు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చిన్ననాటి నుండే సాహిత్య లోకానికి చేరువై ప్రకృతి ఒడిలో ఓనమాలు దిద్ది ప్రకృతి కళాభిపాపిగా ఎదిగిన తీరు ఈ సమాజానికి ఆదర్శప్రాయమన్నారు.
ఆయన రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం వారికి ఇచ్చినటువంటి బిరుదు అని అన్నారు. మామూలు తాపీ మేస్త్రి నుండి గౌరవ డాక్టరేట్ గా ఎదిగిన వ్యక్తి అందెశ్రీ అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని నాయకులు ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు భారీ అశోక్, బీసీ జేఏసీ జిల్లా నాయకులు దుర్గం ప్రసాద్, రాజు, గణేష్, రమేష్, వెంకన్న, కిరణ్ చారి, నాగేంద్రబాబు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.