calender_icon.png 11 November, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినిలకు ఉచిత సైకిళ్లు

11-11-2025 09:55:41 PM

సిద్దిపేట (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలకు బుధవారం ఉచిత సైకిళ్ల పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ ఉపాధ్యాయుడు నీలం శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలోని అక్బర్‌పేట భూంపల్లి మండల పరిధిలోని రామేశ్వరంపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలోని 44 మంది విద్యార్థినిలకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రోటరీ క్లబ్‌ మొయినాబాద్, సికింద్రాబాద్‌ లేడిస్‌ సర్కిల్‌ 17, టిబ్రివాలా ఎలక్ట్రానిక్స్‌  స్వంచ్చంద సంస్థల సహాకారంతో పాఠశాలలో చదువుతున్న 44 మంది విద్యార్థినిలందరికీ ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు.