11-11-2025 09:59:05 PM
సిద్దిపేట క్రైమ్: అనుమతి లేకుండా మద్యం సెట్టింగ్ నిర్వహిస్తున్న గాయత్రి దాబాను సీజ్ చేసినట్టు సిద్దిపేట టూటౌన్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. పట్టణంలోని వేములవాడ కమాన్ పక్కన ఉన్న గాయత్రి దాబాలో సోమవారం మధ్యాహ్నం అక్రమంగా సిట్టింగ్ నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేశారు.
ఆ సమయంలో మిరుదొడ్డి మండలం అల్వాల్ గ్రామానికి చెందిన పూస కుమార్, నబిలా రామచంద్రాచారి మద్యం తాగుతూ పట్టుబడ్డారు. వారితోపాటు దాబా యజమాని అల్లటి శ్రీనివాస్, అందులో పని చేసే బికాస్ పై కేసు నమోదు చేసినట్టు వాసుదేవరావు తెలిపారు. ఈ విషయమై మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ కు లేఖ పంపించినట్టు చెప్పారు. ఆయన దాబాను సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.