11-11-2025 09:57:45 PM
తూర్పుకోట అఖిల పక్ష నాయకులు
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరంగల్ లోని ఖిల్లా వరంగల్, తూర్పు కోట, నూతనంగా నిర్మిస్తున్న రింగ్ రోడ్ ప్రాంతంలో నిత్యం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్ కి తూర్పుకోట అఖిల పక్ష నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ ఆకాతాయిలు, యువకులు, మద్యం ప్రియులు, తదితరులు కాలి ప్రదేశం అయిన రింగ్ రోడ్ పైన మద్యం సేవించి అటు అవైపుగా వెళ్లే వారికి ఇబ్బంది కలిగిస్తున్నారని, అలాగే వ్యవసాయం చేసుకునే రైతులకు ఇబ్బందులు కలిగిస్తూ బావుల దగ్గర కరెంట్ వైర్లు, స్టాటర్స్, మోటార్స్ వంటివి దొంగలిస్తున్నారని ఇటీవల వనపర్తి కర్ణాకర్ అనే రైతు వ్యవసాయ భూమిలో ఉన్న సుమారు లక్ష రూపాయల విలువ గలది రోటివేటర్ ను దొంగలు ఎత్తుకెళ్లారని అన్నారు. నిర్మానుష ప్రాంతం కావున మధ్యం సేవించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
కొటలో కూడా యువకులు అర్ధరాత్రుళ్ళు అడ్డాలు వేసి మధ్యం సేవించి గొడవలకు దిగుతున్నారని, గంజాయి, సిగరెట్లు, మద్యం సేవించడం వలన ఘర్షణలు పడి ప్రాణాలను కోల్పోతున్నారని కావున తప్పకుండ పోలీస్ పీకేటింగ్, పెట్రోలింగ్ ఏర్పాటు చేసి అలాంటి వారిపైన చర్యలు తీసుకొవాలని, పోలీస్ ఆఫిసర్స్ గ్రామంలో లిక్కర్ షాపులు, కిరణం, పాన్ షాప్ యాజమాన్యం, యూత్, అఖిల పక్ష నాయకులు, గ్రామ పెద్దలందరికి ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరడం జరిగిందని అన్నారు. సీఐ తప్పకుండా పోలీస్ పెట్రోలింగ్ కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తామని త్వరలోనే నిందితుల్ని పట్టుకొని తగిన చర్యలు తీసుకుంటామని దొంగతనాలు కూడా అరికడతామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్, అఖిల పక్ష నాయకులు సంగరబోయిన విజయ్, కందిమల్ల మహేష్, బేడిద వీరన్న, బోయిని దూడయ్య, సంగరబోయిన చందర్, బిల్ల కిషోర్, ఆరసం రాంబాబు, వనపర్తి కర్ణాకర్, చింతం రమేష్, బేర వేణు, బేర నరేందర్, ఇట్నేని ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.