calender_icon.png 7 January, 2026 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్యాక్టరీ వద్దు.. భిక్కనూరు ముద్దు..

06-01-2026 01:18:28 AM

కామారెడ్డి అర్బన్, జనవరి 5,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండ లంలో ఫార్మా కంపెనీని  నెలకొల్పడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని స్థానిక యువకులు అన్నారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలో సమావేశమయ్యారు. అనంతరం భిక్కనూరులోని గాంధీ చౌక్  వద్ద నినాదాలు చేశారు.

కంపెనీకి వ్యతిరేకంగా తీర్మానం..

బిక్కనూరు మండలంలో ఫార్మా కంపెనీని ఏర్పాటును వ్యతిరేకించాలని యువకులంతా తీర్మానం చేశారు. ఈ తీర్మానం మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ‘ఫ్యాక్టరీ వద్దు.. భిక్కనూరు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఫార్మా కంపెనీల వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ఫార్మా కంపెనీని అడ్డుకోవాలని వారు ఈ సందర్భంగా నినదించారు.

7న భిక్కనూరు బంద్..

ఈనెల 7వ తేదీన భిక్కనూరు మండలంలో నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నిరసనగా 7న బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.