26-12-2025 12:21:08 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
చిన్న శంకరం పేట(చేగుంట), డిసెంబర్ 25 :ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిరంతర తనిఖీ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం కలెక్టర్ శంకరంపేట ఆర్ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పీహెచ్ సీలోని హాజరు పట్టికను తెప్పించుకుని పరిశీలించారు. ప్రతి రోజు ఇన్ పేషెంట్లు అవుట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారు.
మందులు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలను మెరుగుపరచడం మరియు సిబ్బంది జవాబుదారీతనం పెంచడం ఈ సందర్శనల ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.