26-12-2025 12:19:12 AM
బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
గుమ్మడిదల, డిసెంబర్ 25 :ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటానని, ప్రజల సంక్షేమమే సిజిఆర్ ట్రస్ట్ లక్ష్యమని ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని సాధారణ స్మశానవాటికతో పాటు ఎస్సీ స్మశానవాటికలో ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సొంత నిధులతో రెండు నీటి బోర్లను ఏర్పాటు చేశారు. గురువారం ఈ బోర్లకు గోవర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూస్మశానవాటికలకు వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కుమార్ గౌడ్, హుస్సేన్, దేవేందర్ రెడ్డి, మల్లారెడ్డి, శంకర్ పంతులు, కిరణ్ కుమార్ శర్మ, మొగులయ్య, సత్యనారాయణ, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, సూర్యనారాయణ, ఆంజనేయులు, పాల సత్తయ్య, బొడ్డు కృష్ణ, మ్యకల యాదగిరి, బాల్ శెట్టి, వెంకటేష్, రవీందర్, వినోద్, సతీష్, సత్తయ్య, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.