15-07-2025 05:19:08 PM
జ్వరంతో బాధపడుతున్న రోగులను రక్తపరిక్షలు చేసిన వైద్యాధికారి డాక్టర్ అభినవ్
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల సర్వాయి ఉపకేంద్రంలోని (గుత్తికోయగూడెం) పాలాయిగూడెం గ్రామంలో కన్నాయిగూడెం వైద్యాధికారి డాక్టర్ అభినవ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో జ్వరంతో బాధపడుతున్న రోగులను పరిశీలించి, మలేరియా ఆర్డీటీ పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు.
అంతేగాక, దోమ కాట్ల నివారణ మరియు లార్వా నియంత్రణ చర్యల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటి సర్వే కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ప్రసూతి తర్వాతి (పీఎన్సీ) కేసును గుర్తించి,ఆమెకు బిడ్డకు తినిపించాల్సిన తల్లిపాలు ప్రాముఖ్యత,సక్రమంగా పిల్లలను పెంచే విధానాలు మరియు వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించారు.