15-07-2025 05:23:09 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన నేపథ్యంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కు అధికార పగ్గాలను అప్పగించాలని మంచిర్యాల జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇన్చార్జి పైడిమల్ల నర్సింగ్(Mancherial District Telangana Cricket Association In-charge Paidimalla Narsing) కోరారు. మంగళవారం బెల్లంపల్లిలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రూ.170 కోట్ల అవినీతితో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిజాయితీ బయటపడిందని ఆయన విమర్శించారు.
బీసీసీఐ ప్రతి ఏడాది రూ.100 కోట్లలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అందజేస్తుందని, అయితే ఈ నిధులను తెలంగాణలోని ఏ జిల్లాలో కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. ఒకవేళ ఖర్చు చేస్తే ఏ జిల్లాలో టర్ఫ్ పిచ్ లను ఏర్పాటు చేశారో? ఎక్కడ మ్యాట్లు, నెట్లు ఏర్పాటు చేశారో? ఎంత మంది క్రీడాకారులకు శిక్షణ ఇప్పించి పైకి తీసుకువచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హెచ్సీఏ మారుమూల ప్రాంతాల క్రీడాకారులను అసలు పట్టించుకోలేదని ఆరోపించారు. నిధుల అవినీతికి పాల్పడి దుర్వినియోగం చేశారని పైడిమల్ల నర్సింగ్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్ అల్లం వెంకటేశ్వర్లూ, జాడి శేఖర్, గౌతం క్రీడాకారులు ఉన్నారు.