05-08-2025 11:05:28 PM
మేడ్చల్,(విజయక్రాంతి): స్టూడెంట్ నర్సింగ్ అసోసియేషన్, తెలంగాణా వారు ప్రతి ఏటా నిర్వహించే రాష్ట్ర స్థాయి వాలీ బాల్ పోటీలలో మహమ్మద్ కైఫ్ నాయకత్వంలో మెడిసిటి కాలేజీ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు ట్రోఫీ సాధించారు. సంగారెడ్డిలోని యం యన్ ఆర్ మెడికల్ కాలేజీ ఆవరణలో జరిగిన ఫైనల్స్ లో గెలుపొందిన మెడిసిటీ నర్సింగ్ కళాశాల విద్యార్థులు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ విద్యుల్లత చేతుల మీదుగా ట్రోఫీ అందుకొన్నారు. గెలుపొందిన విద్యార్థులను ఫ్రొఫెసర్ శివరామకృష్ణ, ప్రెసిడెంట్, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ మరియు డా. సి మల్లికార్జున రెడ్డి, డైరెక్టర్ అకడమిక్స్, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ ను మెడిసిటీ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. హైమావతి శ్రీరాముల కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, కోచ్ జి శివారెడ్డి అభినందించారు.