18-11-2025 06:00:17 PM
వరంగల్/హన్మకొండ (విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ తమ సమగ్ర హోం హెల్త్‌కేర్ సర్వీసులను మరింత ప్రజలకు చేరువ చేయడానికి రూపొందించిన కొత్త సృజనాత్మక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ క్రియేటివ్‌లో కుటుంబం ఆధారంగా రూపొందించిన విజువల్ థీమ్ ఉండి, సౌకర్యం, భద్రత, నమ్మకమైన వైద్య సేవలను ప్రతిబింబిస్తుంది. ప్రతి ఇంటికి ఆరోగ్య సేవలను అందించాలనే మెడికవర్ లక్ష్యాన్ని ఈ ప్రచారం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సేవల్లో శాంపిల్ కలెక్షన్, నర్సింగ్ కేర్, అటెండెంట్/కేర్‌టేకర్ సపోర్ట్, ఫిజియోథెరపీ, డాక్టర్ విజిట్, మెడిసిన్ డెలివరీ, టెలి కన్సల్టేషన్, పూర్తి హెల్త్ చెక్‌ప్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి.
ముఖ్యంగా వయోవృద్ధులు, కదలికలు పరిమితమైన వారు, బిజీగా ఉండే కుటుంబాలు, ఇంట్లోనే భద్రంగా చికిత్స పొందదలచుకునే వారికి ఈ సేవలు ఎంతో సాయం చేస్తాయి. హాసిల్-ఫ్రీ మెడికల్ సపోర్ట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఒక ఫోన్ కాల్‌తోనే హాస్పిటల్-క్వాలిటీ సేవలు ఇంటి వద్ద అందించడమే మెడికవర్ హోం హెల్త్‌కేర్ ప్రత్యేకత అని ఈ క్రియేటివ్ తెలియజేస్తుంది. వరంగల్‌లో పేషెంట్-సెంట్రిక్ ఆరోగ్య సేవలలో మెడికవర్ ముందంజలో ఉన్నదనే సందేశాన్ని ప్రచారం బలపరుస్తుంది. సమాజానికి మరింత దగ్గరగా ఉండే విధంగా, అనుకూలత, సౌకర్యం, కరుణాతో కూడిన ఆరోగ్య సేవలను అందించడంలో మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ తమ కట్టుబాటును ఈ క్యాంపెయిన్ పునరుద్ఘాటిస్తోంది.