06-01-2026 12:00:00 AM
కోదాడ, జనవరి 5: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కోదాడ పురపాలక సంఘంలో జరగనున్న మున్సిపల్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో సోమవారం పురపాలక సంఘ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఎ.రమాదేవి మాట్లాడుతూ, 1, అక్టోబర్ 2025 నాటికి ఓటరు జాబితా ప్రాథమికంగా సిద్ధం చేసి, పట్టణంలోని 35 వార్డులకు సంబంధించిన ఓటరు జాబితాను ఈ నెల 10న తుది ఓటరు జాబుతా ప్రచురిస్తామని తెలిపారు.
ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉన్నవారు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది ఓటరు జాబితాను జనవరి 10, 2026న ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, టీడీపీ తదితర రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.