calender_icon.png 10 January, 2026 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణ సవరణకు సీఎంను ఒప్పించాలి

06-01-2026 12:00:00 AM

తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్

ముషీరాబాద్, జనవరి 5  (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవగాహన రాహి త్యం వల్ల ఎస్సీలలోని 59 కులాలకు అన్యా యం జరిగిందని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో జేఏసీ చైర్మన్ మందల భాస్కర్, జేఏసీ గౌరవ అధ్యక్షుడు చెరుకు రాంచందర్, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ చైర్మ న్ బేర బాలకిషన్ మాట్లాడారు.

ఎస్సీ వర్గీకరణ సవరణ చట్టం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే విధంగా మాలల పక్షాన మాల మంత్రులు భట్టి విక్రమార్క, వివేక్ వెంకటస్వామి, గడ్డం ప్రసాద్‌కుమార్, మాల ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో రాహు ల్, రావు, డా.పి.వీరస్వామి, మనోజ్‌కుమార్, గంగాధర్, గోపి సత్యనారాయణ, మల్లేష్ పాల్గొన్నారు. 

కాగా అసెంబ్లీ సమావేశాల సందర్బంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ముంద స్తుగా బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద పోలీసులు మాల జేఏసీ నేతలను అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.