calender_icon.png 25 May, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా157 షూటింగ్ ప్రారంభం

24-05-2025 12:00:00 AM

చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘మెగా157’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాను షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహూ గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. నయనతార చిరంజీవికి జోడీగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

మొదటి రోజు చిరంజీవితోపాటు ఇతర నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.