calender_icon.png 25 May, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేన్స్‌లో గీతా సందేశం

24-05-2025 12:00:00 AM

కొన్నేళ్లుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తళుకులీనుతున్న ఐశ్వర్యరాయ్ ఈసారి కూడా సందడి చేశారు. ఆమె ఈ వేడుకలో పాల్గొనడం ఇది 22వ సారి. కాగా, ఈయేడు ఐశ్వర్యకు ఎంతో ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ భామ ఈసారి భారతీయ ఉట్టిపడేలా రెడ్‌కార్పెట్‌పై హొయలుపోయారు. తొలిరోజు చీరకట్టులో నుదిటన సిందూరం పెట్టుకొని సౌందర్యారాధకుల దృష్టిని ఆకర్షించారు.

అలా మొదటి హాఫ్ వైట్ శారీలో భారతీయత ఉట్టిపడేలా రాయల్ లుక్‌లో కనిపించిన ఈ మాజీ ప్రపంచ సుందరి.. రెండోరోజు కూడా తన ప్రత్యేకతను చాటారు. మోడ్రన్ దుస్తులు ధరించినప్పటికీ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు విలువనిచ్చారు. తన డ్రెస్‌పై భగవద్గీత శ్లోకంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఫొటోలు షేర్ చేశారు. “ఐశ్వర్య ధరించిన డ్రెస్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఆ బనారసీ కేప్‌పై ‘భగవద్గీతలోని ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు సదాచన’ అనే శ్లోకాన్ని చేతితో సంస్కృతంలో ఎంబ్రాయిడరీ చేశారు” అని తెలిపారు.

తద్వారా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను, భగవంతుడు అందించిన అమూల్య సంపద భగవద్గీత గొప్పతనాన్ని ఐశ్వర్య ప్రపంచానికి చెటిచెప్పారు. ఐశ్వర్య రెండోరోజు లుక్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. భగవద్గీతకు ఇటీవల యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో చోటు లభించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఐశ్వర్య ప్రపంచానికి చాటిచెప్పడం కోసం ఈ డ్రెస్ ధరించి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.