calender_icon.png 20 October, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు

20-10-2025 12:08:20 AM

  1. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ 
  2. పెరిగిన చలితీవ్రత

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రం లో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ సూచించింది. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖ మ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యా దాద్రిభువనగిరి, రంగారెడ్డి, వికారా బా ద్, మహబూబ్‌నగర్, నాగ ర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గ ద్వాల్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

సోమ, మంగళ, బుధవారం వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కా గా రాష్ట్ర వ్యాప్తంగా చలితీవ్రత కాస్త పెరిగింది. జిల్లా ల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెల్లవారు జాము, అర్థరాత్రి, సాయం కాలంలో చలి ప్రభావం కా స్త పెరిగింది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతుండటం లో ఈమార్పులు సంభవిస్తున్నాయి. ఈనెల చివరి నుంచి ఉష్ణోగ్రతలు మరిం త పడిపోయే అవకాశముం ది. నవంబర్ నుంచి చలి తీ వ్రత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధి కారులు అంచనా వేస్తున్నారు.