calender_icon.png 17 October, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు డా. కె.శశీ శ్రీ

16-10-2025 11:56:47 PM

ఖమ్మం (విజయక్రాంతి): గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిని టాస్క్ ఫోర్స్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ డా. శశీ శ్రీ ఖమ్మం జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. ఎం. నరేందర్ డా. శశీ శ్రీని ప్రతి వార్డుకు తీసుకెళ్లి వైద్యులు, సిబ్బంది సేవల్ని పరిశీలించారు. హాస్పిటల్ లోని వివిధ వార్డులు, ఆపరేషన్ థియేటర్, డ్రగ్ స్టోర్స్ ను తనిఖీ చేశారు. సబ్ డ్రగ్ స్టోర్స్ లో, సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ లో గల వివిధ మందుల సరఫరా విధానాన్ని, ఉపయోగాన్ని, ఈ ఔషధీ ఆన్లైన్ పోర్టల్ ను పరిశీలించారు.

ప్రతి వార్డులో వున్న రిజిస్టర్స్, రికార్డ్స్, పేషంట్ కేస్ షీట్ లను పరిశీ లించారు. హాస్పిటల్ లో గల ఫైర్ సేఫ్టీకి సంబంధించిన, పరికరాలు (ఫైర్ ఎస్టింగ్విషర్), పని తీరు, ఎక్స్పెరి డేట్స్ పరిశీలించారు, ఆసుపత్రిలోని వివిధ పరికరాల గురించి తెలుసుకున్నారు. రూ.5 లక్షలపై బడిన ఆసుపత్రి పరికరాలను వార్షిక మెయింటేనెన్స్ చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, సెక్రటరీ ఆదేశాల మేరకు జిల్లాస్థాయి నుండి గ్రామస్థాయి వరకు గల వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో భాగంగా తాను ఈ ప్రభుత్వ ఆసుపత్రిని సంద్శించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. రామారావు బయో మెడికల్ ఇస్లావత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.