calender_icon.png 19 October, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ 12వ మెగా వార్షికోత్సవం

17-10-2025 12:00:00 AM

2వ స్థానాన్ని గెలిచిన అకడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ బీరంగూడ

అమీన్ పూర్, అక్టోబర్ 16 : ఢిల్లీలో ఈనెల 6, 7 తేదీల్లో నిర్వహించిన అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ 12వ వార్షిక మెగా పోటీలలో 2025-2026 లో అత్యుత్తమ ప్రదర్శన ప్రకటించడం గర్వంగా ఉందని డైరెక్టర్ సీహెచ్.శ్రీనివాసరావు, ఆర్.శిరీష తెలిపారు. ఈ పోటీలో పాల్గొన్న 94 మందిలో తమ పాఠశాల విద్యార్థులు 26 బంగారు, 27 వెండి, 26 కాంస్య పతకాలు గెలుచుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా విజేతలను అభినందించి సత్కరించారు. వచ్చే ఏడాది పాఠశాల అగ్ర బహుమతి గెలుచుకుంటుందని  డైరెక్టర్ శ్రీనివాసరావు విశ్వాసం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఆర్.శిరీష మాట్లాడుతూ విద్యార్థులను ఉత్సాహపరుస్తూ వైఫల్యం విజయానికి ఒక మెట్టు చింతించవద్దని, రాబోయే సంవత్సరాల్లో ఖచ్చితంగా ఉత్తమంగా రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం పిల్లలను రన్నరప్లుగా తీర్చిదిద్దడంలో అవిశ్రాంతంగా కృషి చేసినందుకు ఆటల విభాగం, కళా విద్య విభాగం, పని విద్య విభాగం, యోగా విభాగం, సమన్వయకర్తల బృందాన్ని వారు అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు.