calender_icon.png 19 October, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతలకు మద్దతు ధర కోసమే..

17-10-2025 12:00:00 AM

నిర్మల్, అక్టోబర్ 1౬ (విజయక్రాంతి): పంటలు పండించిన రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మొక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాలకు 2400 ధర చెల్లిస్తుందని రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు.

రెండు రోజుల్లో సోయ కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి ఎఫ్‌ఎసిహెచ్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్ మార్కెట్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.