calender_icon.png 21 January, 2026 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ గా మెంచు నగేష్, బాధ్యతలు స్వీకరణ

29-10-2024 01:43:07 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిసిన అదనపు కలెక్టర్ మెంచు నగేష్

అధికారుల సమన్వయంతో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడానికి విశేష కృషి చేస్తా

అదనపు కలెక్టర్ మెంచు నగేష్..

మెదక్: మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ గా నియమితులైన మెంచు నగేష్, మంగళవారం మెదక్  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మెంచు నగేష్ మాట్లాడుతూ.. జిల్లా సమర్థవంతమైన పాలనలో కలెక్టర్ గారి సూచనలు సలహాలు పాటిస్తూ వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు విశేష కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నర్సాపూర్ ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన మహిపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మెంచు నగేష్ కు జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు సిబ్బంది పూల బొకేలు శాలువాలతో శుభాకాంక్షలు తెలిపారు.