calender_icon.png 12 May, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత

12-04-2025 12:00:00 AM

మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, ఏప్రిల్ 11 (విజయ క్రాంతి): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తూ సనాతన హిందూ ధర్మ స్థాపనకు పాటుపడాలని మాజీ మంత్రి జోగు రామ న్న అన్నారు. శ్రీ అయ్యప్ప స్వామి జన్మోత్సవ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి జోగు రామన్న శుక్రవారం పలు అయ్యప్ప ఆలయాలను సందర్శించారు. అదిలాబాద్ రూరల్ మండలం బెల్లూరి శ్రీ అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు.

అలాగే హోమయజ్ఞ చేపట్టారు. అనంత రం  రవీంద్ర నగర్‌లోని నూతన అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. జోగు రామన్న మాట్లాడుతూ  ఆధ్యాత్మికం ద్వారా శాంతి స్థాపన చేకూరుతుందని అన్నారు. ప్రస్తుత యాంత్రిక జీవితంలో ఆధ్యాత్మిక మార్గం ద్వారానే మానసిక ప్రశాంతత  లభిస్తుందన్నారు కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.