12-04-2025 12:00:00 AM
ఎమ్మెల్యే అనిల్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు
తాంసి, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): అధికార కాంగ్రెస్ పార్టీ కాదని బోథ్ ఎమ్మెల్యే సమక్షంలో భీంపూర్ మండలంలోని తాంసీ (కే) గ్రామానికి చిందిన మాజీ సర్పంచ్ వినోద్‌తో కలిసి పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో ఉన్న వ్యతిరేకను భరించలేక బీఆర్‌ఎస్ పార్టీ లో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నాగయ్య, మాజీ ఎంపీపీ సంతోష్, మాజీ వైస్ ఎంపీపీ లస్మన్న, మాజీ సర్పంచ్ లింబాజీ, గంగయ్య, ప్రవీణ్, అఫ్రోజ్, మాజీ ఎంపీటీసీ మహేందర్, మండల నాయకులు కార్యకర్తలు ఉన్నారు.