29-11-2025 12:04:22 AM
60 మందికి పైగా న్యూరోసర్జన్ ఫెలోలు, రెసిడెంట్లు హాజరు
హైదరాబాద్(రాజేంద్రనగర్), నవంబర్ 28 (విజయక్రాంతి): తొలి ఎడిషన్ అద్భుతమైన విజయాన్ని సాధించిన స్ఫూర్తితో రెనో వా ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ సైన్సె స్ (ఆర్‌ఐఎన్‌ఎస్), పాన్ రీసెర్చ్ ఫౌండేషన్, ప్రతిష్ఠాత్మకమైన సెరెబ్రోవాస్క్యులర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీవీఎస్‌ఐ), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ సంయుక్తాధ్వర్యంలో రాజేంద్రనగర్‌లోని కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌లో రెండవ హ్యాం డ్స్-ఆన్ వర్క్‌షాప్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మైక్రోవాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ స్కిల్ ట్రైనింగ్ ఆన్ లైవ్ యానిమల్స్ అండ్ మాడ్యూల్స్’ అనే అం శంపై జరుగుతున్న ఈ వర్క్‌షాప్ శనివా రం కూడా కొనసాగుతోంది. ఈ వర్క్‌షాప్‌లో దేశవ్యాప్తంగా 60 మందికి పైగా న్యూరోసర్జన్ ఫెలోలు, రెసిడెంట్లు హాజరయ్యారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్యాట్రన్లుగా డాక్టర్ ఐ. దినకర్, ప్రముఖ న్యూరోసర్జన్, నిమ్స్ మాజీ డైరెక్టర్, శ్రీధర్ పెద్దిరెడ్డి , ఫౌం డర్ అండ్ సీఈఓ, రెనోవా గ్రూప్ ఆఫ్ హా స్పిటల్స్, వ్యవహరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ జ్ఞాన ప్రకాశ్ ఎం., వైస్-చాన్సలర్ అండ్ ఛైర్మన్, పీవీఎన్‌ఆర్టీవీయూ, హైదరాబాద్, హాజరయ్యారు. గౌర వ అతిథులుగా డాక్టర్ కేవీఆర్ శాస్త్రి, సీనియర్ న్యూరోసర్జన్, డాక్టర్ బీసీఎం ప్రసాద్, సీనియర్ న్యూరోసర్జన్ పాల్గొన్నారు. ప్రత్యేక అతిథులుగా డాక్టర్ ఎం. ఉదయ కుమార్ , డీన్ ఆఫ్ ఫ్యాకల్టీస్, పీవీఎన్‌ఆర్టీవీయూ, డాక్ట ర్ బి.స్వాతి, ఇన్‌చార్జి అసోసియేట్ డీన్, పీవీఎన్‌ఆర్టీవీయూ పాల్గొన్నారు.
ఈ వర్క్‌షాప్ లోమైక్రోవాస్క్యులర్ స్యూచరింగ్, జంతు కణజాలం, హై-ఫిడిలిటీ మోడల్స్ ఉపయోగించి వెస్సెల్ అనాస్టమోసిస్, లైవ్ యాని మల్ ఆపరేటివ్ ట్రైనింగ్,ఎండోవాస్క్యులార్ సిమ్యులేషన్ సెషన్స్ అంశాలపై చర్చించనున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ సయ్యద్ అమీర్ బాషా పస్పాలా, కోర్స్ డైరెక్టర్ అండ్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్, న్యూరోమొడ్యులేషన్ స్పెషలిస్ట్, రెనో వా ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ సైన్సె స్ (ఆర్‌ఐఎన్‌ఎస్), బంజారాహిల్స్, హైదరాబాద్, మాట్లాడుతూ శస్త్రచికిత్సా ఆవిష్కర ణలు, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, అలాగే బహుళ విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడమే ఈ వర్క్‌షాప్ ఉద్ధేశ్యమన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా పాల్గొనే వారిలో న్యూరోవాస్క్యులర్ నైపుణ్యాలు మరింత బలోపేతం అవుతాయన్నారు.
ఈ వర్క్‌షాప్ కేవలం శిక్షణ మాత్రమే కాదు, న్యూరోవాస్క్యులర్ శస్త్రచికిత్స భవిష్యత్తును మెరుగుపరచడానికి చేస్తున్న ఒక పె ట్టుబడి, అని అన్నారు. కోర్సు డైరెక్టర్ అండ్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్(ఆర్‌ఐఎన్‌ఎస్) డాక్టర్ టీవీ రామకృష్ణ మూర్తి మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్‌లోని ప్ర తి శిక్షణా మాడ్యూల్ ను నిర్మాణాత్మకంగా, దశలవారీ మార్గదర్శకంతో రూపొందించామన్నారు.
ఈ శిక్షణలో పాల్గొనే న్యూరోస ర్జన్లు, ఫెలోలు , రెసిడెంట్లు తమ శస్త్రచికిత్సా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు, చికిత్సలో అవసరమైన కచ్చితత్వాన్ని సాధించేందుకు ఈ వర్క్ సహాయపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సైంటిఫిక్ అడ్వైజరీ సభ్యులు, సీవీఎస్‌ఐకార్యవర్గ సభ్యు లు, ఫ్యాకల్టీ, నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.