calender_icon.png 29 November, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ వర్సిటీలపై అజమాయిషీ అవసరం

29-11-2025 12:02:32 AM

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): ప్రైవేట్ యూనివర్సిటీలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీ ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ప్రైవేట్ యూనివర్సిటీలపై మూడు రోజుల క్రితం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తున్నట్లు తెలిపారు.   ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వా ల అనుమతి అవసరం ఉంటుంది, కానీ ఆతర్వాత నుంచి ఆయా వర్సిటీలపై రాష్ట్ర ప్రభు త్వాల అజమాయిషీ లేకుండా పోతుందన్నారు.

ఈక్రమంలోనే ఇకపై ప్రైవేట్ యూని వర్సిటీల ఏర్పాటుకు అనుమతినివ్వడమే కాకుండా, ఏర్పాటు తర్వాత కూడా ప్రభుత్వాల అజమాయిషీ ఉండాలన్నారు. ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటు, పరిపాలన, నిధులు, వర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పర్యవేక్షణపై దర్యాప్తు చేపట్టాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించిన సం గతి తెలిసిందే. అన్ని ప్రైవేట్, ప్రభుత్వేతర, డీమ్డ్ టు బీ యూనివర్సిటీల స్థాపనకు దారితీసిన చట్టాలు, నిబంధనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరాలను అందించాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం కోరింది. 

వెబ్‌సైట్‌లో కోర్సుల వివరాలు 

 తెలంగాణ ఉన్నత విద్యామండలి వెబ్ సైట్‌లో డ్యాష్ బోర్డును అందుబాటులో ఉంచనున్నట్లు విద్యామండలి అధికారులు తెలిపారు. కోర్సులు, సీట్ల వివరాలతోపా టు వర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల సమాచారమంతా వెబ్‌సైట్‌లో త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఈ సమాచారం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఓ అధికారి తెలిపారు.