29-11-2025 12:04:29 AM
- నామినేషన్ల స్వీకరణకు పది క్లస్టర్ల ఏర్పాటు
-కందుకూరు, మహేశ్వరం ఎంపీడీవోలు సరిత, శైలజరెడ్డి
కందుకూరు/మహేశ్వరం,నవంబర్ 28 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరు,మహేశ్వరం మండలాల్లో ఆయా గ్రామ పంచాయతీల్లో జరగనున్న సర్పం ఎన్నికల నేపథ్యంలో సర్పం అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ డిసెంబర్ 3 నుండి 5 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఆయా మండలాల ఎంపీడీవోలు బానోతు సరిత,శైలజా రెడ్డి లు తెలిపారు.కందుకూరు,మహేశ్వరం మండలాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడో విడతలో జరగనున్న నేపథ్యంలో వారు ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు.
ఆరవ తేదీన నామినేషన్ల పరిశీలన అలాగే చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తామని వారు తెలియజేశారు.తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు నామినేషన్ ల ఉపసంహరణ అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను సైతం ప్రచురిస్తామని వారు పేర్కొన్నారు. కందుకూరు మండలంలో నామినేషన్లు వేసే క్లస్టర్ పరిధి వివరాలు...
కందుకూరు, కొత్తగూడ, దెబ్బడగూడ గ్రామాల సర్పం అభ్యర్థులు కందుకూరు క్లస్టర్ గ్రామపంచాయతీలో లేమూరు, అగర్మియగూడ,సరస్వతి గూడ,లేమూరు క్లస్టర్ గ్రామపంచాయతీలో గూడూరు, అన్నోజిగూడ,కొత్తూరు గ్రామాల సర్పం అభ్యర్థులు గూడూరు క్లస్టర్లో ముచ్చర్ల, సాయిరెడ్డి గూడ,దాసర్లపల్లి,దాసర్లపల్లి తండా గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభ్యర్థులు ముచ్చర్ల క్లస్టర్లో నేదునూరు,బాచుపల్లి,జైత్వారం గ్రామాల అభ్యర్థులు నేదునూరు క్లస్టర్ లో పులిమామిడి,దావుద్ గూడ తండా,పెద్దమ్మ తండా,పులిమామిడి క్లస్టర్ లో చిప్పలపల్లి, మురళి నగర్,దన్నారం గ్రామాల సర్పం అభ్యర్థులు చిప్పలపల్లి క్లస్టర్లో రాచులూరు, బేగంపేట్,బైరాగి గూడ,కటికపల్లి గ్రామాల సర్పం అభ్యర్థులు రాచులూరు క్లస్టర్లు లో మాదాపూర్,కొలను గూడ,జబ్బారు గూడ, గుమ్మడవెల్లి గ్రామాల సర్పం అభ్యర్థులు మాదాపూర్ క్లస్టర్లో మీర్ఖాన్పేట్,సార్ల రావులపల్లి,ఆకుల మైలారం గ్రామాల సర్పం వార్డ్ మెంబర్ అభ్యర్థుల నామినేషన్లు మీర్ఖాన్ పేట క్లస్టర్ లో నామినేషన్లు దాఖలు చేయాలని ఎంపీడీవో సరిత తెలియజేశారు.
మహేశ్వరం మండలంలో....
ఆకన్ పల్లి,మన్సాన్పల్లి,ఉప్పుగడ్డ తండ, గట్టుపల్లి గ్రామాల సర్పం అభ్యర్థులు గ్రామపంచాయతీ భవనం మన్సాన్పల్లి నందు నామినేషన్లు దాఖలు చేయాలని ఎంపీడీవో శైలజా రెడ్డి తెలిపారు.కొత్వాల్ చెరువు తండ,నాగులోని తండ, మహేశ్వరం గ్రామ పంచాయతీల సర్పం అభ్యర్థులు మహేశ్వరంలో దుబ్బచెర్ల,సుభాన్పూర్, కల్వకోల్ గ్రామాల సర్పం అభ్యర్థులు వార్డు సభ్యులు దుబ్బచెర్లలో గోల్లూరు, నాగిరెడ్డిపల్లి,హబీబుల్లా గూడ,సర్పం వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు గొల్లూరులో గంగారం,సిరిగిరి పురం సర్పం అభ్యర్థులు సిరిగిరి పూర్ లో డబిల్ గూడ,పెండ్యాల,రామచంద్రా గూడ సర్పం అభ్యర్థులు,వార్డు సభ్యులు పెండ్యాల లో కోళ్ల పడకల్,దిల్వార్ గూడ, పోరండ్ల గ్రామాల అభ్యర్థులు కొల్లపడకల్లో అమీర్పేట్,తూప్రా కుర్దు,పెద్దమ్మతండ, మాణిక్యమ్మ గూడ గ్రామాల సర్పం వార్డు సభ్యులు పోటీ చేసే అభ్యర్థులు అమీర్పేటలో నందు పల్లి,నాగారం,పడమటి తండా గ్రామాల సర్పం అభ్యర్థులు వార్డు ల అభ్యర్థులు నాగారం గ్రామంలో పడమటి తండా,తుమ్మలూరు,మోహబత్ నగర్ గ్రామపంచాయతీ ఎన్నికలకు పోటీ చేసే సర్పం వార్డు సభ్యులు జిపి భవనం నాగారంలో తమ తమ నామినేషన్లు దాఖలు చేయాల్సిందిగా ఎంపీడీవో శైలజా రెడ్డి సూచించారు.పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు కుల ధ్రువీకరణ పత్రం లేదా నామినేషన్ పత్రాల్లోని మూడవ పార్ట్ లో గెజిటెడ్ అధికారి సంతకం చేయిస్తే సరిపోతుందని ఆయా మండలాల ఎంపిడిఓలు పేర్కొన్నారు.ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా పాసుబుక్ జిరాక్స్ కొత్తది అందజేయాలని వారు సూచించారు.ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ దశ నుండి చివరి వరకు పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని వారు హితవు పలికారు.